గీతం అధ్యాపకులు..ఐవీ సుబ్బారెడ్డికి..

‘లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌’ అవార్డు
నవతెలంగాణ-పటాన్‌చెరు
గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌, ఫిజిక్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఐ.వీ.సుబ్బారెడ్డికి ‘ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ (జీవితకాల సాఫల్య) అవార్డు వచ్చింది. బెంగళూరులోని సామాజిక, ఆర్థికాభివృద్ధి జాతీయ విద్యా సంస్థ ఇటీవల ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ఇచ్చి సత్కరించినట్టు గీతం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. దేశాభివృద్ధి, బోధన, పరిశోధన, పత్ర సమర్పణలో డాక్టర్‌ ఐవీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్టు తెలిపారు. అడ్వాన్స్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పియరిక్‌ సైన్స్‌ నుంచి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ నుంచి సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోతో పాటు సీఐఎస్‌ఆర్‌ నుంచి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ రీసెర్చ్‌ స్కాలర్‌గా డాక్టర్‌ రెడ్డి ఇంతకు మునుపు గుర్తింపు పొందినట్టు తెలిపారు. జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్‌ సుబ్బారెడ్డిని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్‌ దత్తాత్రి కె.నగేష్‌, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ టి.విశ్వం, తదితరులు ఆయన్ను అభినందించారు.

Spread the love