హిట్‌ మాస్‌ సాంగ్‌

Hit mass songజీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘కోటబొమ్మాళి పిఎస్‌’. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. రాహుల్‌ విజరు, శివాని రాజశేఖర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. ఇప్పటికే విడుదలైన శ్రీకాకుళం మాస్‌ సెన్సేషనల్‌ సాంగ్‌ ”లింగి లింగి లింగిడి” సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ అలరిస్తోంది.ఈ పాటతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ పాట సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ,’ఒక పాట హిట్‌ అయితే సక్సెస్‌ మీట్‌ చేయడం మాకు తెలిసింది ఫస్ట్‌ టైం అనుకుంటా. ఈ సాంగ్‌ ఎలా ఉందంటే సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇది తెలుగోడి జానపదం దమ్ము’ అని తెలిపారు.డైరెక్టర్‌ తేజ మార్ని మాట్లాడుతూ, ‘నా సినిమాలో జానపద పాట పెట్టాలి అనేది నా డ్రీమ్‌. సినిమాలో ఈ పాట కాదు ప్రతి సీన్‌ అదిరిపోతుంది’ అని అన్నారు.

Spread the love