మరోసారి జంటగా..

Once again as a couple..నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్‌ ఇండియా చిత్రం (ఎన్‌సి 23) ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ పై నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్స్‌లో భాగంగా మంగళవారం హీరోయిన్‌ కూడా టీమ్‌తో జాయిన్‌ అయ్యారు. అయితే బుధవారం మేకర్స్‌ ఆమె ఎవరో అధికారికంగా వెల్లడించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించనున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి గతంలో సూపర్‌ హిట్‌ ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలో కలిసి పనిచేశారు. కొత్త సినిమాలోనూ తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించబోతున్నారు. అలాగే ఇది నాగ చైతన్య, చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం. హై ప్రొడక్షన్‌, టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందనుంది. కేవలం ప్రీ ప్రొడక్షన్‌ పనులకే నిర్మాతలు మంచి బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్‌ త్వరలో అనౌన్స్‌ చేస్తారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Spread the love