మంచి గుర్తింపు వచ్చింది

good
Identity
cameసిరియా యుద్ధంలో శత్రువులకు బందీగా చిక్కిన ఓ యువతి తన మరణ ప్రపంచాన్ని ఎలా తప్పించుకుంది? అనే కాన్సెప్ట్‌తో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ రిలీజ్‌ చేసిన అతిపెద్ద ఎక్స్‌ ట్రాక్షన్‌ సిరీస్‌ ‘ది ఫ్రీలాన్సర్‌’. శిరీష్‌ థోరట్‌ రాసిన ‘ఎ టికెట్‌ టు సిరియా’ పుస్తకం ఆధారంగా భావ్‌ ధూలియా దర్శకత్వం వహించారు. ఫ్రైడే స్టోరీటెల్లర్స్‌ నిర్మించిన ఈ సిరీస్‌కి నీరజ్‌ పాండే సష్టికర్త, షోరన్నర్‌ కూడా. ఇందులో ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా తన పాత్రకి వచ్చిన గుర్తింపు గురించి జాన్‌కొక్కెన్‌ మాట్లాడుతూ, ‘బాడీ లాంగ్వేజ్‌, మదువుగా మాట్లాడటం ఇలా.. చాలా విష యాలను అండర్‌ ప్లే చేయాల్సి వచ్చింది. ఇది పూర్తిగా నాకు కొత్త పాత్ర. ఈ విషయంలో నటుడు కే కే మీనన్‌ నాకు స్ఫూర్తి. ఆయన మాట్లాడే, నవ్వే విధానాన్ని అనుకరించాను. ఒక పర్‌ఫెక్ట్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా ఎంతో సహజంగా నటించగలిగా. నా పాత్రకు మంచి గుర్తింపు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పారు.

Spread the love