ఆ డబ్బులను రైతులకు ఇస్తా..

That Money Will Be Given To The Farmers.హీరో విశాల్‌, ఎస్‌ జే సూర్య, రీతూ వర్మ కాంబోలో వచ్చిన ‘మార్క్‌ ఆంథోని’ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్‌ వినోద్‌ కుమార్‌ నిర్మించారు. ఈనెల 15న రిలీజ్‌ అయిన ఈ చిత్రం సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతూ, మంచి వసూళ్లని రాబడుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో విశాల్‌ మాట్లాడుతూ,’మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. రివ్యూలు బాగుండి, కలెక్షన్లు కూడా బాగా వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో మా సినిమా ఉండటం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు పెట్టిన టికెట్‌ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. ప్రతీ టికెట్‌ నుంచి ఒక రూపాయి రైతులకు ఇస్తాను’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఇండియాలో దుమ్ములేపేస్తోంది. అదిరింది. నా డబ్బింగ్‌ చాలా బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది’ అని ఎస్‌ జే సూర్య అన్నారు.
సునీల్‌ మాట్లాడుతూ, ‘నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. ఈ సినిమాకు ఎన్ని సీక్వెల్స్‌ అయినా తీసే సత్తా ఉంది’ అని చెప్పారు. ‘మార్క్‌ ఆంథోని అనేది నాకు రచయితగా, దర్శకుడిగా పునర్జన్మను ఇచ్చింది. విశాల్‌ లాంటి హీరో నన్ను నమ్మడం అనేది ఆశామాషీ వ్యవహారం కాదు. నన్ను నమ్మిన విశాల్‌కి, అడిగిందల్లా ఇచ్చిన నిర్మాత వినోద్‌కి థ్యాంక్స్‌’ అని అధిక్‌ రవిచంద్రన్‌ అన్నారు.

Spread the love