హైదరాబాద్ : బ్యాంకింగేతర విత్త సంస్థ ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ ‘బంగారు రుణాల మేళా’ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 2600 శాఖల్లో జూన్ 30 వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. ఈ కాలంలో తనఖా రుణాల ఖాతాదారులకు లక్కీ డ్రా నిర్వహించి కార్, ఎలక్ట్రిక్ స్కూటర్, టివి తదితర బహుమతులను అందించనున్నట్లు ఐఐఎఫ్‌ఎల్ ప్రతినిధి సౌరభ్ కుమార్ తెలిపారు.