రాజస్థాన్‌లో ఉచిత విద్యుత్‌ అమలు

జైపూర్‌: రాజస్థాన్‌లో ఉచిత విద్యుత్‌ పథకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగానికి ఎలాంటి బిల్లు వసూలు చేయరు. ప్రజలందరికీ ఉపయోగపడే ఈ పథకం గురువారం నుంచి అమల్లోకి వచ్చిందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగిస్తే ఒక్క పైసా కూడా వసూలు చేయబోమని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వివరించారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గురువారం నుంచి ప్రజలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబరు నెలలో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలలు జరగనున్నాయి.

Spread the love