ఉపాధికి పెరిగిన డిమాండ్‌

– అధిక సంఖ్యలో హాజరవుతున కూలీలు
– ఎండ తీవ్రత కోసం గ్రామపంచాయతీ నుంచి వసతులు కల్పించాలి
– పని దినాలు 200 రోజులకు పెంచాలని కూలీల డిమాండ్‌
నవతెలంగాణ-కోట్‌పల్లి
ఉపాధి హామీకి డిమాండ్‌ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రోజువారి కూలీ రూ.300లు ప్రకటించడంతో గ్రామాలలో ఉన్న ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరు కావడానికి మొగ్గు చూపుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో తమ సొంత పొలాలకు వెళ్లలేని రైతులు ఉదయం పూట ఉపాధి పనికి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 5828 జాబ్‌ కార్డ్స్‌ ఉండగా 11414 మంది ఉపాధి కూలీలు పనికి వెళ్తున్నట్టు అధికారుల లెక్కల చెబుతున్నాయి. ఈ పనితో అటు రైతుకు ఇటు ఉపాధి కూలీకి లాభం జరగడంతో పనికి లాభమేనని కూలీలు చర్చించుకుంటున్నారు. కొన్ని కుటుంబాలలో ముగ్గురు, నలుగురు కూలీలు ఉన్న జాబ్‌ కార్డు మాత్రం ఒక్కటే ఉండడంతో 100 రోజుల పని దినాలు పూర్తవుతున్నాయని ప్రతి జాబ్‌ కార్డు దారుడికి 200ల పని దినాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. గతంలో ఎండ తీవ్రత కోసం గతంలో మేటి వైజుగా షేర్‌ నెట్టు, కూలీలకు గాయాల కోసం ఫస్ట్‌ యాడ్‌ బాక్స్‌, వంటివి ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం అవి అందుబాటులో లేకపోవడంతో దెబ్బలు తగిలినప్పుడు కూలీలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీ డబ్బులు రూ. 300 ఉన్న దాదాపుగ రూ. 200ల నుంచి రూ. 250 వరకు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో కూలీలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పని చేసే ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉపాధి డబ్బులు సైతం వారానికి వారానికి వచ్చే విధంగా చూడాలని కూలీలు కోరుతున్నారు.

జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తున్నాం
ఉపాధి హామీలో గ్రామానికి రైతులకు ఉపయోగపడే పనులు చేయిస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం పారం పండు, పార్మిషన్‌ రోడ్డు, కుంటలు, పాతవి పూడిక తీయడం పీడర్‌ ఛానల్‌ కెనాల్‌ వంటి పనులు చేయిస్తున్నాం. కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తున్నాం.
– ఈసీ ఎలీషా

పాత పద్ధతి బాగుంది
గతంలో మాస్టర్‌ ప్రకారం పనిచేయడం బాగుంది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా పేర్ల ద్వారా రోజువారీగా అటెండెన్స్‌ తీసుకోవడం వలన ఎవరు మిస్‌ అవ్వకుండా ఉండేది. ఈ కొత్త పద్ధతి ద్వారా కొద్దిగా లేటయినా పక్కనే ఉండి వినకపోయినా ఎంతో అటెండెన్స్‌ మిస్‌ కావడంతో ఆరోజు పని వృధా అవుతుంది. పాత పద్దతినే కొనసా గించాలి.
– తెలుగు దస్తయ్య బార్వాద్‌

పని దినాలు ఎక్కువగా కల్పించాలి
గతం కంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఉపాధి పని ప్రదేశంలో వసతులు కల్పించాలి. కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉండటం వల్ల పని రోజులు అయిపోతున్నాయి. పని దినాలు పెంచితే బాగుంటుంది. అధికారులు స్పందించి ఉపాధి డబ్బులు తొందరగా ఇచ్చే విధంగా చూడాలి.
– క్యాసారం పెంటయ్య ఉపాధి కూలీ

Spread the love