దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనం వృధా చేయడం శోచనీయం

నవతెలంగాణ-నేరేడ్‌మెట్‌
సీఎం కేసీఆర్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనాన్ని వృధా చేయడం శోచనీయమని కాంగ్రెస్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ అన్నారు. గురువారం కాంగ్రెస్‌ ఏ, బీ బ్లాక్‌ కమిటీల ఆధ్వ ర్యంలో నేరెడ్‌మెట్‌ ఎక్స్‌ రోడ్డు వినాయకుని గుడి నుంచి ఆర్డీఓ ఆఫీస్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయంలో ఆర్డీఓ అందుబాటులో లేక పోవడంతో డీఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పదేండ్ల పాలన పూర్త వుతున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చ లేదన్నారు. దశాబ్ది ఉత్సవాలు పేరిట ఆర్భాటానికి రూ.కోట్లు వెచ్చించడం తగదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కేజీ టూ పీజీ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు, దళిత కుటుంబా లకు మూడెకరాల భూమి, పోడు భూముల పట్టాలు, రైతు రుణమాఫీ, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, 12 శాతం గిరిజన రిజర్వేషన్లు ఏ ఒక్క హమీ నెరవేర్చలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్‌ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. హమీల అమలు కోసం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి స్తామనీ, ఇంకా హమీలు అమలుచేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో వెంకటేష్‌ యాదవ్‌, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, గుత్తి రామచందర్‌, వినోద్‌యాదవ్‌, సానాది శంకర్‌, ఉమేష ్‌సింగ్‌, సంతోష్‌ ముదిరాజ్‌, ప్రవీణ్‌, బీకే.శ్రీనివాస్‌, పోల్క ం వెంకటేష్‌, రాములు, డోలి రమేష్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, కృష్ణగౌడ్‌, రెబ్బ వాసు, కుట్టి శ్రీనివాస్‌ యాదవ్‌, విట్టల్‌, సూర్య ప్రకాష్‌, బుచ్చిబాబు, ప్రవీణ్‌, సంతోష్‌ యాదవ్‌, నరసింహ గౌడ్‌, సాయికుమార్‌, జాన్‌, షేక్‌, జె కే సాయి, మోహన్‌ యాదవ్‌, బాలకష్ణ, శ్యాం రావు, శ్రీనివాస్‌, ఆశ, కష్ణ వేణి, ప్రభా, స్వప్న రోజా రమణి, వీనస్‌ మేరీ, విజయ లక్ష్మి, నిర్మల, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love