చిర్యాలలో బఫర్‌ జోన్లను మింగేస్తున్న పాలకవర్గం

నవతెలంగాణ-మేడ్చల్‌కలెక్టరేట్‌
మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామపంచాయతీ పరిధిలో బఫర్‌ జోన్లలో నాళాలు, ఇనాం భూముల్లో అక్రమ వెంచర్లు చేసి అమాయక ప్రజలకు అక్రమ అనుమతులు ఇస్తూ రూ.కోట్ల ప్రజా ధనాన్ని చీర్యాల పాలకవర్గం దోచుకుటుందని హ్యూమన్‌ రైట్స్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు అరవింద్‌ అన్నారు. బుధవారం చీర్యాలలో వారు విలేకర్లు, గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనీ, పలువురు యువకులు గ్రామపంచాయతీ పరిధిలో వందల్లో అక్రమ నిర్మాణాలు అక్రమ అనుమతులు అక్రమ వెంచర్లు చేసి ప్రభుత్వ భూములు బఫర్‌ జోన్లు నాళాలు కబ్జాలు చేసి వెంచర్లుగా మలిచి రూ.కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టు ఎన్నోసార్లు రుజువు చేసినా ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కొంతకాలంగా చీర్యాలలో ఎనిమిది మంది పంచాయతీ సెక్రెటరీలు మారడం ఈ చర్చకు దారితీసినట్టు తెలిపారు. అక్రమాలకు సహకరించని సెక్రెటరీలపై పాలకవర్గం కుట్రపూరితంగా బదిలీలు చేయించిందన్నారు. 2018 నుంచి చీర్యాల గ్రామంలో అనేక నకిలీ లేఔట్లు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఆ అక్రమ లేఅవుట్‌లో వందల సంఖ్యలో నకిలీ అనుమతి పత్రాలని సృష్టించి ఒక్కొక్క నకిలీ అనుమతి పత్రానికి రూ.1,50, 000 చొప్పున వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతు న్నారనీ, ఈ విషయమై ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అక్రమాలను తొలగించాల ని రిపోర్టులు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపో వడం సరికాదన్నారు. చీర్యాల గ్రామంలోని ప్రజాప్రతి నిధులు కలిసి అక్రమాలకు పాల్పడుతూ ఊరిని దోచుకుం టున్నారనీ, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నా రనీ, ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతున్నారనీ, ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రజలు చీర్యాల గ్రామపంచాయతీలోని బఫర్‌ జోన్‌లో నాళాలపై ఇల్లు కొనుక్కొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాజీ సర్పంచ్‌ అశోక్‌ మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చెప్పేది నిజమే అనీ, భారీ వర్షాలు పడితే ఈ కాలనీలు కొట్టుకుపోతా యని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ మేడ్చల్‌ జిల్లా సెక్రెటరీ కొమ్మ ప్రవీణ్‌ కుమార్‌, రాగుల అరుణ్‌, చీర్యాల్‌ యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సింగిరెడ్డి అభిలాష్‌ రెడ్డి, కోల సాయినాథ్‌ యాదవ్‌, పోతగళ్ల ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love