క్షుద్బాధ

Be careful with grapes..?వర్తమాన చరిత్ర అంచులపై
వికటాట్టహసం చేస్తున్న మతోన్మాదం
అంతర్గత ద్వేషంతో అధికార క్రౌర్యం
మత్యు భేరీలు మోగిస్తుంటే
ఆశల్ని ఆకాంక్షల్ని కర్కశంగా
నేల రాస్తూ రక్త చరిత్రను
లిఖిస్తున్న యుద్దోన్మాదం
బతుకే నరకమై క్షణమొక యుగమై
గుండెల్ని మెలిపెట్టే దుర్భర వేదన
సాయుధ ఘర్షణల నరమేధానికి
గాలిలో దీపమైన ప్రాణాలు
కుటిల నాయకత్వం అగ్గిని రాజేస్తూ
పంతాల పట్టింపుల్లో విశ్రమించని
మతోన్మాద అస్తిత్వ నిరూపణకు
రోజుకో ఆత్మఘోష
నిప్పుల గుండంలో దేశాల దాడుల ధమనకాండకు
ఆకలిమంటల చితిమంటలు యుద్ద జ్వాలలై ఎగుస్తుంటే
నిర్వాసితులై నిస్సహాయులుగా
ఆకులు తిని కడుపు నింపుకుంటున్న ధైన్యం
క్షుద్బాధను తట్టుకోలేని నడిచే
జీవచ్ఛాలైన వద్ధులు
ముక్కు పచ్చలారని పసిపిల్లల
హాహాకారాల ఆర్త నాదాలు
మూగజీవుల మూగరోధనలతో
పోరాడుతున్న జీవనకాంక్షలు
దారుణ దశ్యాల్ని ఘోషిస్తుంటే
మత్యు ఘాతంలో పీనుగుల కుప్పలు
ఓ కాలమా ఈ యుద్ధం
ఆత్మహననమా విస్తాపితమా జాతిహననమా
భవిష్యత్‌ పురోగమనానికి దారేది
మత్యు భేరీలు మోగిస్తున్న
రాజ్య కాంక్ష ఇప్పట్లో చల్లారేనా
విశ్వ మానవాళి హితవును కాంక్షించి
యుద్ధం విరమించి
సుస్థిర శాంతి సౌభాగ్యాలకు బాటలు వేసేనా
– సునీత నెల్లుట్ల, 7989460657

Spread the love