కివీస్‌ లక్ష్యం 285

– ఛేదనలో ప్రస్తుతం 28/1
– శ్రీలంకతో న్యూజిలాండ్‌ తొలి టెస్టు
క్రైస్ట్‌చర్చ్‌ : శ్రీలంక, న్యూజిలాండ్‌ తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఐదో రోజు ఆటలో ఫలితం కోసం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 28/1తో కొనసాగుతుంది. ఓపెనర్‌ టామ్‌ లేథమ్‌ (11 బ్యాటింగ్‌), కేన్‌ విలియమ్సన్‌ (7 బ్యాటింగ్‌) అజేయంగా ఆడుతున్నారు. డెవాన్‌ కాన్వే (5) నిరాశపరిచాడు. చివరి రోజు ఆటలో 90 ఓవర్లలో న్యూజిలాండ్‌కు మరో 257 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక మరో 9 వికెట్ల దూరంలో నిలిచింది. ఇక బ్లెయిర్‌ టిక్‌నర్‌ (4/100), మాట్‌ హెన్రీ (3/71), టిమ్‌ సౌథీ (2/57) రాణించటంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు కుప్పకూలింది. ఎంజెలో మాథ్యూస్‌ (115, 235 బంతుల్లో 11 ఫోర్లు) శతకానికి తోడు ధనంజయ డిసిల్వ (47), దినేశ్‌ చండిమాల్‌ (42) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 373 పరుగులు చేయగా.. శ్రీలంక 355 పరుగులు చేసింది.

Spread the love