తగ్గిన బంగారం, వెండి ధరలు

నవతెలంగాణ- హైదరాబాద్ : ఇండియాలో భారీగా బంగారం పెరుగుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్ అందింది. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 62, 990 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 57, 740 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 75, 000 గా నమోదు అయింది.

Spread the love