జపాన్‌లో మోడీ

హిరోషిమా:జి-7 సదస్సు కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్‌కు చేరుకున్నారు. జపాన్‌ అధ్యక్షతన హిరోషిమా పట్ట ణంలో జరుగుతోన్న ఈ సదస్సులో భారత్‌ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. హిరోషిమా చేరుకున్న మోడీ ఇక్కడ భారతీయులతో సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన లో ఉంటారు. జపాన్‌తో పాటు పపౌ న్యూ గునియా, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటిస్తారు. జపాన్‌ పర్యటనలో భాగంగా మోడీ హిరోషిమాలో మహా త్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించను న్నారు. హిరోషియా చేరుకున్నాను.ఇక్కడ జరుగుతున్న జి-7 దేశాల సద స్సులో పాల్గొంటున్నాని మోడీ ట్వీట్‌ చేశారు. జి-7లో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. భా రత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇం డోనేసి యా,దక్షిణకొరియా,వియత్నాం లాంటి మరికొన్ని దేశాల అధినేతలు ఈ సద స్సుకు ఆహ్వానితులుగా వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇం ధన సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల నా యకులూ సదస్సులో పాల్గొంటారు.

Spread the love