కదిలిస్తూ..కలిసి ముచ్చటిస్తూ..

Moving..kissing together..– ప్రజలతో మమేకమవుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌
– ఉపాధి హామీ చట్టం రద్దుకు మోడీ కుట్ర
– నకిరేకల్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ -నకిరేకల్‌/ తుంగతుర్తి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజా గొంతుక భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు. జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం నాగయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë, అభ్యర్థి జహంగీర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడలా జనాన్ని కదిలిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ఇతర పార్టీల అభ్యర్థుల చరిత్ర, సీపీఐ(ఎం) చరిత్ర.. ప్రజాఉద్యమాలను వివరించారు.
నకిరేకల్‌ మండలం మంగళపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల ప్రాంతంలో కూలీలను కలిసిన నాగయ్య.. చట్టం అమలు.. నిధుల గురించి వివరించారు. బీజేపీ పదేండ్ల పాలనలో ఉపాధి హామీకి బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా తగ్గిస్తూ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. బడ్జెట్‌లో రెండు లక్షల 50 వేల కోట్లు కేటాయించాల్సింది రూ.80వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. కేటాయించిన 80 వేల కోట్లు గత ఏడాది చేసిన పనుల బకాయిలకే సరిపోతుందన్నారు. ఇక కూలీలకు వందరోజుల పని కల్పించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పనిచేస్తున్న కూలీలకు మంచినీటి సౌకర్యం, నీడ కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. నిత్యం ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎండి.జహంగీర్‌కు ఓటేసి పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాచకొండ వెంకట్‌ గౌడ్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యుడు బక్కయ్య, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, నాయకులు కొప్పుల అంజయ్య, దూరేపల్లి ఎల్లయ్య, బస్క యేసు, అంతటి వెంకటయ్య పాల్గొన్నారు.
ఉద్యమాలే ఊపిరి.. పేదల సంక్షేమమే తమ ధ్యేయం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë
ఉద్యమాలే ఊపిరిగా, పేద ప్రజల సంక్షేమమే తనధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌కు ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు మండలపరిధిలోని అన్నారం గ్రామంలో అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మిక, కర్షక, ప్రజాహక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. ఉపాధిహామీ చట్టం అమలు చేయించిన ఘనత ఎర్రజెండాకే దక్కుతుందన్నారు. ప్రశ్నించే గొంతుక ఎండి.జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కోరారు.
తుంగతుర్తి కమ్యూనిస్టుల అడ్డా.. : జహంగీర్‌
తుంగతుర్తి గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని.. ఈ ప్రాంతంలో భీమ్‌ రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఎంతో అభివృద్ధి చేశారని సీపీఐ(ఎం) భువనగిరి అభ్యర్థి ఎండి.జహంగీర్‌ అన్నారు. నేడు ఎన్నికలు డబ్బులతో కూడుకున్నవని, కమ్యూనిస్టు లకు డబ్బులు ఖర్చు పెట్టే శక్తి లేదన్నారు. ప్రజలకు డబ్బులు అలవాటు చేసింది కార్పొరేట్‌ రాజకీయాలే నని, ఆ డబ్బులను ప్రజలు తిరస్కరించే రోజులొస్తా యని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడే కమ్యూనిస్టులకే ఓటు అడిగే నైతికహక్కు ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీకి కులం, మతం, గుడి, ఆచార వ్యవహారాలు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి అంటే తెలియద న్నారు. మతతత్వాన్ని పెంచుతూ సైన్స్‌ను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడా నికి, పోరాటాలు చేయడానికి ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, నాయకులు ముల్కలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, మట్టిపెల్లి సైదులు, పులుసు సత్యం, జోగునూరి దేవరాజ్‌, ముత్తయ్య, యాదగిరి పాల్గొన్నారు.

Spread the love