ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు..మహోన్నతమైన శక్తి

నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
సినీ నటుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు మహోన్నతమైన శక్తి అని సినీ, రాజకీయరంగంలో మకుటం లేని మహనీయునిగా వెలుగొందాడని, తెలుగువారి ఆత్మగౌరానికి చేసిన కషి ఎనలేనిదని తెలుగుదేశం ్ట రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ దారోజు జానకిరాములు అన్నారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ పార్క్‌లో ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు.కేక్‌ కట్‌ చేశారు.అనంతరం మాట్లాడుతూ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ నుంచి ఏర్పాటు చేసి తొమ్మిది నెలల అనతికాలంలోనే ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం లోకి వచ్చిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.ఆయన హయాంలో కిలో రెండు రూపాయల పథకం, జనతా వస్త్రాలు పంపిణీ, ఆస్తీలో స్త్రీలకు సమాన వాటా కల్పించారని చెప్పారు.పరిపాలనలో జవాబుదారీతనం ఉండేలా సంకల్పించాడని, ప్రజలకు రాజకీయ చైతన్యం పెంపొందేలా చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాజుల వెంకన్న, ఎంపీటీసీ నాగయ్య,తెలుగుదేశం వివిధ మండలాల నాయకులు చౌడోజు వీరాచారి, గోవిందాచారి ఎలిమినేటి సుధాకర్‌రెడ్డి, తెలుగుదేశం మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మునీర్‌ఖాన్‌, శెట్టిపల్లి సైదులు, చంద్రశేఖర్‌, పోలోజు రామాచారి, వెంకట్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల: టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతవసంతాల ( వందవ ) జన్మదిన వేడుకలను మండలకేంద్రంలో ఆ పార్టీ నాయకులు, ఎన్‌టీఆర్‌ అభిమానులు ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ నడికూడలిలో వేసవికాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పాల్వాయి రమేష్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టి అజేయన్నారు.ఈకార్యక్రమంలో ఏనుగంటి పుల్లయ్య చౌదరి , నిమ్మగడ్డ సుబ్బారావు చౌదరి , కుంటిగొర్ల రామచంధ్రయ్య యాదవ్‌ , అల్లు నాభూషణం చౌదరి, సామ సైదులు, శివనేని శ్రీరాములు , చందమళ్ళ వెంకన్న, చింతలనర్సింహారావు, జింకల పిచ్చయ్యనాయుడు, ఆళ్ళ దశరథóచౌదరి, రావి హశ్వంత్‌ చౌదరి, కుక్కపల్లిమాల్యాద్రిచౌదరి, ఎరసింఘ్‌ నారాయణచౌదరి, చెరుకు మల్లికిశోర్‌చౌదరి, కొల్లు వెంకటేశ్వర్‌రావుచౌదరి, కామళ్ళ వెంకయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love