– ప్రియాంక గాంధీ, కమల్‌నాథ్‌లపై ఎఫ్‌ఐఆర్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వ అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌లపై కేసులు నమోదయ్యాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టరయ్యాయి. ప్రియాంక, కమల్‌నాథ్‌లకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై కమల్‌నాథ్ స్పందించారు. ” వారిని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసుకోనివ్వండి. వారు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగలరు” అని కమల్‌నాథ్ అన్నారు. ’50 శాతం కమీషన్’ అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవినీతిపై ప్రియాంక, కమల్‌నాథ్‌లు చేసిన ట్విట్టర్ పోస్టులను ఇతర కాంగ్రెస్ నాయకులు రీట్వీట్ చేశారు.