రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం.. ఆస్తి నష్టం

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో ఉన్న సప్తగిరి రైస్ మిల్లులో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రైస్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైస్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చేరవేగి 48 వేల గోనె సంచులు, బియ్యం, వడ్లు కాలిపోయాయి సుమారు రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అలాగే రెండు మోటార్లు కాలిపోయినట్లు బాధితుడు అశోక్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి,  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
Spread the love