ఇథియోపియన్‌ యువరాజు అవశేషాలు

తిరిగి ఇవ్వడానికి ఇంగ్లండ్‌ నిరాకరణ
లండన్‌ : ఒక ఇథియోపియన్‌ యువరాజు మృతదేహం అతని దేశానికి 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్‌లోని విండ్సర్‌ శశ్మాన వాటికలో ఖననం చేయడం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఈ యువరాజు మృతదేహం అవశేషాలను ఇథోయోపియాకు ఇవ్వడానికి ఇంగ్లండ్‌ అంగీకరించడం లేదు. ఈ సంఘటన వివరాల ప్రకారం ప్రిన్స్‌ డెజాచ్‌ అలెమాయేహు (1861-1879) అబిస్సినియా (ఇప్పుడు ఇథియోపియా అని పిలుస్తున్నారు) సింహాసనానికి వారసుడు. ఇతని తండ్రి చక్రవర్తి టెవోడ్రోస్‌ 2 1868లో ఇంగ్లండ్‌తో జరిగిన యుద్ధంలో మరణించాడు. దీంతో అలెమ యేహును, అతని తల్లిని ఇంగ్లండ్‌కు బలవంతంగా తీసుకుని వచ్చారు. అయితే తల్లి మార్గమధ్యంలో మరణించింది. ఇంగ్లండ్‌కు తీసుకుని వచ్చిన అలెమాయెహును బ్రిటీష్‌ ఆర్మీ ఆఫీసర్‌ ట్రిస్టమ్‌ చార్లెస్‌ సాయర్‌ స్పీడి ఆధ్వర్యలో ఉంచారు. అతన్ని ప్రముఖ పాఠశాలల్లో చదువుచెప్పారు. అతని జీవితం బ్రిటన్‌ రాజవంశస్థులతో గడిచినప్పటికీ అలెమాయేహు దయనీ యమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చరిత్రకారుల కథనం. తీవ్రమైన జాత్యాహంకారాన్ని ఎదుర్కొన్నాడని, ఇథియోపియన్‌కు తిరిగి పంపించాలనే అతని అభ్యర్థనలను రాజ ప్రభుత్వం విస్మరించిందని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మృతదేహం అవశేషాలను తిరిగి ఇవ్వడానికి కూడా ఇంగ్లండ్‌ నిరాకరిస్తుంది.

Spread the love