రిటైర్డ్‌ జడ్జిలకు రెండేళ్లపాటు రాజకీయ పదవులొద్దు

– సుప్రీంకోర్టులో పిటీషన్‌
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు పదవీ విరమణ చేసిన తరువాత రెండేళ్ల వరకూ గవర్నర్‌ వంటి రాజకీయ పదవులు స్వీకరించకుండా నిషేధం విధించాలని కోరుతూ పిటీషన్‌ దాఖలయింది. బాంబే లాయర్స్‌ అసోసియేషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో ఈ పిటీషన్‌ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ను ఆంద్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఇటీవల నియమించడాన్ని పిటీషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ వేయడానికి ఇదే కారణమని తెలిపింది. ప్రజాస్వామ్య సూత్రాలను, రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్ష్యాన్ని కాపాడాలని పిటీషన్‌ కోరింది. బాబ్రీమసీదు-రామజన్మభూమి, 2016 నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్‌ నజీర్‌ ఒక న్యాయ మూర్తిగా ఉన్నారు.

Spread the love