కుల దురహంకార హత్యలపై పాలకుల మౌనం

– ప్రత్యేక చట్టం తేవాలి :రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కుల మత దురహంకార హత్యలపై పాలకులు మౌనం వీడాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. దురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం తేవాలని సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎస్‌కే, కేవీపీఎస్‌ సంయుక్తంగా కుల దురహంకార హత్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ ఎవరికి వారుగా కాకుండా ఐక్యంగా ‘కుల, మతాంతర వివాహాల రక్షణ వేదిక’ గా ఏర్పడాలని సూచించారు. ఈ వేదిక బాధితులకు అండగా ఉండాలని సూచించారు. మీడియాలో పరువు హత్యకుల మత దురహంకార హత్యలపై పాలకులు మౌనం వీడాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. దురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం తేవాలని సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య ల పేరు పెట్టి ప్రచారం చేయటం తగదని గుర్తుచేశారు. కులోన్మాద, పురుషాహంకార, హత్యలుగా చూడాలని విజ్ఞప్తి చేశారు టీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు జి.రాములు మాట్లాడుతూ కుల,మత ధర్మాల పేరుతో, సనాతన సంప్రదాయం పేరుతో బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను ప్రోత్సాహిస్తున్నదని తెలిపారు. దేశంలో కులం కొందరికి వసరమైతే ..ఎందరికో శాపంగా మారిందని వివరించారు. కుల రహిత సమాజం కోసం సాంస్కృతిక విప్లవమే తీసుకురావాలని సూచించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ.. కులం మతం పేరుతో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను హత్యలుగావిస్తున్నా.. మానవ హక్కుల కమిషన్‌, మహిళా కమిషన్‌ స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌. వినయ కుమార్‌ మాట్లాడుతూ..కుల మత వివాహాలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. కుల రహిత, మత రహిత సమాజం కోసం భూస్వామ్య భావజాలంపై సాంస్కృతిక యుద్దం చేయాలని పిలుపునిచ్చారు. కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వహీద్‌ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్లయినా 30 కోట్ల మంది అంటరానితనంతో, వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు.రాష్ట్రంలో కూడా కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధత వల్లనే కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ హత్యలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. కుల నిర్మూలనా సంఘం గౌరవాధ్యక్షురాలు గట్టు జ్యోత్స్న. ఎస్‌వీకే బాధ్యులు జి బుచ్చిరెడ్డి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్‌, సీనియర్‌ నాయకులు పీఎస్‌ఎన్‌ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ‘కుల,మతాంతర వివాహాల రక్షణ వేదిక (జేఏసీ) ఏర్పాటు చేసి,ఈ ఐక్య కార్యాచరణకు జస్టిస్‌ చంద్రకుమార్‌ అధ్యక్షతన కుల నిర్మూలన పోరాటాలకు పిలుపు నివ్వాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది.

Spread the love