బ్లడ్‌ బ్యాంక్‌ ఉద్యోగులకు జీతాలేవి?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి (టీసాక్స్‌) పరిధిలోని బ్లడ్‌ బ్యాంకుల్లో పని చేస్తున్న సిబ్బంది జీతాల సమస్యను ఎదుర్కొంటున్నారు. గత కొంత కాలంగా ప్రతి నెలా జీతాలు ఆలస్యంగా ఇస్తుండటంతో ఇంటి అద్దె, ఇతర నెలవారీ చెల్లింపులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పరిధిలో నుంచి బ్లడ్‌ సేఫ్టీ డివిజన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌)లో విలీనం చేశారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణలో రక్తం, రక్త ఉత్పత్తుల భద్రత, లభ్యత తదితర పనులను ఇందులో సిబ్బంది నిర్వహిస్తుం టారు. బ్లడ్‌ బ్యాంకుల నుంచి సకాలంలో పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వివరాలను సకాలంలో పంపించిన ప్పటికీ కొంత మంది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యమవు తున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే టీసాక్స్‌ ఏపీడీ చెబుతున్న వాదన మరో రకంగా ఉంది. పెర్ఫార్మెన్స్‌ వివరాలు రావాల్సి ఉన్నందునే జాప్యం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనా ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో జీతాలు వస్తే తప్ప ప్రశాంతంగా పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Spread the love