ఉపకార వేతనాలను నమోదు చేసుకోవాలి

– కాలేజీలు, విద్యార్థుల కోసం ఇ-పాస్‌ వెబ్‌సైట్‌ : రాహుల్‌ బొజ్జా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
2022-23 విద్యాసంవత్సరానికి గాను తాజా, రెన్యూవల్‌ ఉపకార వేతనాల కోసం కాలేజీలు, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా జూన్‌ ఒకటి నుంచి 15 వరకు తెలంగాణ ఇ-పాస్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చినట్టు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌ఈసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకోనందున ఈ అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు.

Spread the love