మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన

నవతెలంగాణ – కంటేశ్వర్
మహిళా కుస్తీ పోటి క్రీడాకారులపై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపి, రెజ్లింగ్ సమాఖ్య అద్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై కేంద్ర ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోకపోగా కీచక బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలనిపోరాడుతున్న రెజ్లర్స్ పై బిజెపి కేంద్ర ప్రభుత్వం దాష్టికానికి పాల్పడడం అత్యంత ఫాసిస్టూచర్యగా బహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ బి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ విమర్శించారు. ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. బేటి పడావో బేటి బచావో అంటూ మనకీ బాత్ అంటూ ఊదరగొట్టే ప్రధాన మంత్రి తన పార్టీకి చెందిన కీచక ఎంపీని అరెస్టు చేయకపోవడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని, మొన్నటి కర్నాటక ప్రజలు చెప్పిన విధంగానే దేశ ప్రజలు తగిన సమయం తగిన బుద్ది చెపుతారని హెచ్చరించారు. ఢీల్లీ కేంద్రంగా మహిళా కుస్తీ పోటి క్రీడాకారుల పోరాటానికి పౌర సమాజం మద్దతును ఇవ్వాలని దండి వెంకట్ కోరారు.

Spread the love