ట్రాక్టర్‌ డ్రైవర్లకు స్కిల్డ్‌ వేతనాలిచ్చేందుకు సింగరేణి అంగీకారం

– ఏఎల్సీ వద్ద ఒప్పందం కుదిరింది : ఎస్‌సీకేఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణిలోని సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్లకు స్కిల్డ్‌ వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యం ఈ మేరకు అంగీకరించిందనీ, అస ిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) వద్ద ఒప్పందం జరిగిందని సింగరేణి కాంట్రా క్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు తెలిపారు. యాజమాన్యం ఈ మేరకు సర్క్యూలర్‌ను విడుదల చేసిందని చెప్పారు. ఇదే విషయంపై సింగ రేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం (సీఐటీయూ), సింగరేణి యాజమాన్యానికి మధ్య ఏఎల్సీ(సెంట్రల్‌) వద్ద సోమవారం జరిగిన చర్చల్లో స్కిల్డ్‌ వేతనాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వివరించారు.
స్కిల్డ్‌ వేతనాలను 1-10-2022 నుంచి వాటిని అమలు చేయాలని అన్ని ఏరియాలకు సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్‌ జారీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్లకు రోజుకు రూ.577 చెల్లిస్తుండగా ఈ ఒప్పందం ప్రకారం రోజుకు రూ.695 అందుతాయని చెప్పారు. తద్వారా ప్రతి ట్రాక్టర్‌ డ్రైవర్‌ నెలకు రూ.3,068 అదనంగా జీతం పొందుతారని తెలిపారు. స్కిల్డ్‌ వేతనాలు చెల్లించేందుకు అంగీకరించిన సింగరేణి డైరెక్టర్‌ (పా) శ్రీ ఎన్‌. బలరాం, జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) కుమార్‌రెడ్డి, ఏజిఎం (పర్సనల్‌)కవితా నాయుడు, ఇతర సింగరేణి పర్సనల్‌ అధికారులు అశోక్‌ తిరుపతి, డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) డి. శ్రీనివాసులు, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మహేష్‌, ఎం సట్టికార్‌, ఇతర సింగరేణి, లేబర్‌ అధికారులకు సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. సెంట్రల్‌ లేబర్‌ ఆఫీసు వద్ద జరిగిన చర్చల్లో మధుతో పాటు ట్రాక్టర్‌ డ్రైవర్లు జి. రంజిత్‌, పి. రాజు, కె. వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love