శ్రీక ఈవెంట్స్‌ సంగీత నత్య వాయిద్య సమ్మేళనం శ్రావ్యం కను విందు

నవతెలంగాణ-కల్చరల్‌
సుమారు పది ఘంటల పాటు నత్యాలతో శాస్ట్రీయ సంగీతం, వాయిద్య గోష్ఠి తో ప్రేక్షకులకు కను విందు చేశారు.. శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై శ్రీక ఈవెంట్స్‌ శ్రీ రాగ వల్లరి వార్షికోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. జయదేవుని అష్ట పది కీర్తనలను నర్తకీ మణులు అద్భుతంగా ప్రదర్శించి గాన సభ ను నవ రస భరతం చేశారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్‌ ఎస్‌. పీ.భారతి పాల్గొని కళాకారులను సత్కరించి మాట్లాడారు. సంగీతం నత్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తే వారు చదువులో ఒత్తిడి కి గురి కారని, ఆత్మ విశ్వాసం కలుగు తుందని అన్నారు. శ్రీక ఈవెంట్స్‌ ఉన్నత ఆశయం తో ప్రతిభావంత కళా కారులను ప్రోత్సహిస్తోందని అన్నారు. ప్రముఖ సంగీత గాయని డాక్టర్‌ రమాప్రభ మాట్లాడుతూ నత్యం, గీతం, గానం కలిస్తే భారతీయ కళలు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుదర్శన్‌ సింగ్‌ అధ్యక్షత వహించిన సభలో సంఖ్యాశాస్త్రవేత్త డైవజ్ఞ శర్మ, సంగీత దర్శకుడు ఆత్రేయ , బి. జె.పీ.నాయకుడు వంశీ కష్ణ పాల్గొన్న సభలో సంస్థ స్థాపకులు ఉదయ శ్రీ, చంద్ర రేఖ లు మాట్లాడుతూ తమ సంస్థ ఆన్‌లైన్‌లోనూ, కరోనా సమయంలోనూ కార్యక్రమాలు చేశామని తెలిపారు. గురువులు అహల్య, శైలజ, లలిత వినోద్‌, నరసింహ ప్రసాద్‌ లను సత్కరించారు.

Spread the love