ప్రయివేటు కళాశాలకు ధీటుగా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల

– ఫలితాల్లో దుమ్ము లేపిన తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల 
– కార్పొరేట్ కళాశాలలను మించిన అత్యుత్తమ ఫలితాలు
– ప్రిన్సిపాల్- లెక్చరర్ల  కృషి అమోఘం
నవతెలంగాణ – తాడ్వాయి
ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఏజెన్సీలోని తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలు ప్రభంజనం సృష్టించారని ప్రిన్సిపాల్ అవిలయ్య హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో ములుగు జిల్లా తాడ్వాయి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాల్లో ద్వితీయ స్థానం సంపాదించి, సత్తా చాటింది. కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను మించిన ఫలితాలను సాధించి  ‘ఔరా’ అనిపించుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ అవిలయ్య, లెక్చరర్ల బృందం కృషి వల్లనే ఇందుకు కారణమని మండల ప్రజలు, పేరెంట్స్, మేధావులు, విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.  తాడ్వాయి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించారు. ఈ చర్యలన్నీ ఫలించి కార్పోరేట్ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు. జట్టి హేమంత్ సెకండ్ ఇయర్ 938/1000 ఎంపీసీ ఫస్ట్ ర్యాంక్, పాయం మేఘన ఫస్ట్ ఇయర్ 444/470 ఎంపీసీ ఫస్ట్ ర్యాంక్, కల్లెబోయిన సాత్విక్ బైపీసీ సెకండియర్ 923 / 1000 ఫస్ట్ ర్యాంక్,  సిహెచ్ అనూష ఫస్ట్ ఇయర్ బైపిసి 413 / 440 మార్కులు, ఎండి సనా సీఈసీ గ్రూప్ సెకండ్ ఇయర్ 737 / 1000,  జిమ్మిడి రాహుల్ హెచ్ ఇ సి సెకండ్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ 829 / 1000 మార్కులు సాధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి:
తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి, మెరుగైన విద్యను అభ్యసించండి అంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సదుపాయాలు గూర్చి తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరిస్తున్నారు. మండలంలోని తాడ్వాయి, కాటాపూర్, బీరెల్లి, మేడారం, నార్లాపూర్, గ్రామాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యాభ్యాసాల ప్రవేశాల కొరకు ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం ద్వారా విద్యార్థులకు ఉచిత విద్య ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యం కలగని విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేశారు. అధ్యాపక బృందం చే కార్పొరేట్ కళాశాలకు దీటుగా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు విధితో పాటు సహా పాఠ్య కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడలు నిర్వహించడం జరుగుతుంది కూడా అవగాహన కల్పించుతున్నారు.
Spread the love