నవ తెలంగాణ-ఆర్మూర్
తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఎన్నారై కువైట్ అధ్యక్షునిగా బట్టు స్వామి కత్తర్, ఉపాధ్యక్షులుగా గురై రాజేందర్ లను రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియమించినట్టు జిల్లా నాయకులు గగ్గుపల్లి శ్యామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాలలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమస్యలపై కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు..