ప్రశాంతంగా పరీక్ష

నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్స్‌ ఇతర పరీక్షల శిక్షణ కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ స్టేట్‌ షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్‌సీ, గ్రూప్స్‌, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షలకు శిక్షణ కోసం ఉచిత వసతి, శిక్షణ కోసం 5 నెలల ఫౌండేషన్‌ కోర్సు 2023 బ్యాచ్‌-1 ఎంపికకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధిశాఖ అధికారి సల్మా బాను పర్యవేక్షించారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న నల్లగొండ, యాదాద్రి జిల్లాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11గంటల మొదలై మధ్యాహ్నం 1 గంటల వరకు శ్రీ చైతన్య హై స్కూల్‌, డీవీకే రోడ్డు, నల్లగొండలో ప్రశాంతంగా నిర్వహించినట్టు ఎస్సి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ పడిదల నవీన్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 405 మంది దరఖాస్తు చేసుకోగా నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుండి 369 మంది హాజరయ్యారని, ప్రవేశ పరీక్ష ఆధారంగా 100 మందిని ఎంపిక చేయనున్నట్లు, వారికి జూన్‌ 1 నుండి శిక్షణ నివ్వనున్నట్లు తెలిపారు.

Spread the love