‘తానా’ సిరివెన్నెల సాహితీ పురస్కారం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం, తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంస్మరణలో తెలుగు పద్య కావ్యాలు / గేయ కావ్యాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఎంపికైన విజేతకు లక్ష రూపాయల నగదు పురస్కారం ఉంటుంది. 1. సమకాలీన సామాజికసమస్యలు-పరిష్కారాలు; 2. మానవసంబంధాలు-కుటుంబ విలువలు; 3. ప్రకతి-పర్యావరణం; 4. యువతరం-భవిష్యత్తు; 5. దేశభక్తి-జాతీయవాదం అంశాలలో ఏదైనా ఒక అంశం తీసుకుని పద్యకావ్యం లేదా గేయ కావ్యం 60 పేజీలకు (ఎ4 సైజులో) మించకుండా ఉండేలా పంపాలి. ఆసక్తి కలిగిన వారు మే 31, 2023లోగా [email protected] ఈమెయిల్‌ కు గాని +1-972-591-1208 నంబరుకు వాట్సాప్‌ గాని పంపవచ్చు. ఫలితాల ప్రకటన జూన్‌ 30, 2023 లోపు ఉంటుంది. వివరాలకు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు – డా. ప్రసాద్‌ తోటకూరను +1-817-300-4747లో గాని, లేదా [email protected] ద్వారా గాని సంప్రదించవచ్చును.

Spread the love