నిరంకుశ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలి

 సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ : బ్యూరోక్రసీ నియంత్రణతో సహా ప్రధాన పాలనా రంగాలపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి గల హక్కులను పరిరక్షిస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఇది కోర్టు ధిక్కరణ మాత్రమే కాదని, రాజ్యాంగ సమాఖ్య స్వభావంపై, జవాబుదారీ నిబంధనలపై, సుప్రీంకోర్టు నిర్వచించిన ప్రజాస్వామ్య పాలనపై ప్రత్యక్ష దాడి అని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
ఈ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించే ఈ చర్య మోడీ ప్రభుత్వ దారుణమైన నియంతృత్వ స్వభావానికి మచ్చుతునక అని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. ఇది కేవలం ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అంశం కాదు, రాజ్యాంగ సమాఖ్య చట్రపరిధిని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నందున ప్రజలందరికీ సంబంధించిన సమస్య. దీన్ని వ్యతిరేకించాలి. ఈ ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది.

Spread the love