మన ఊరు మన బడి పనులు పూర్తి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడిలో బాగంగా మంజురైన నిధులతో పనులు పూర్తి చేసినట్లు సర్పంచ్ లా ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము లు శనివారం తెలిపారు. మన ఊరు – మన బడిలో పనులు చేపట్టడానికి ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక కృషి తో మరమ్మతులు, ఇతర పనులకు గాను 14 లక్షలు, కిచేన్ షేడ్ నిర్మాణానికి 4 లక్షలు ఎన్ అర్ఈజిఎస్ కింద మంజూరు చేసినట్లు వారు వివరించారు. మంజురైన నిధుల నుండి పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. పాఠశాల కు సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని , ఎదైన అవసరం ఉన్న గ్రామ పంచాయతీ, గ్రామ అభివృద్ది కమిటీ నుండి సమకుర్చడం జరిగిందని వివరించారు.

Spread the love