పర్యావరణ పరిరక్షణకు

పాటుపడాలి : గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సలహాదారులు ఎ.పి.వి.ఎన్‌.శర్మ, ఎ.కె.మొహంతీ, కార్యదర్శి జె.భవానీ శంకర్‌, సంయుక్త కార్యదర్శి సీ.ఎన్‌.రఘు ప్రసాద్‌ పాల్గొన్నారు.

Spread the love