”తెలంగాణ మాండలిక కథల రారాజు” అని ఎవరిని పిలుస్తారు?

Who is known as the "king of Telangana dialect stories"?డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు సిలబస్‌ లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా 6 నుండి 10వ తరగతుల పాఠ్యాంశాలు, ప్రక్రియలు, కవులు/రచయితల రచనలు, బిరుదులు, పాఠాల ఉద్దేశాలు క్షుణ్ణంగా చదువుకోవాలి. వాటితో పాటు పాఠం తర్వాత ఉన్న సాహిత్యంశాలపై కూడా దృష్టి సారించాలి. గత డీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని గమనిస్తే 25 నుండి 30% ప్రశ్నలు పాఠ్యపుస్తకాల ఆధారంగానే వచ్చాయి. కేవలం కవి పరిచయాలకే పరిమితం కాకుండా పాఠం లో ఉన్న అంశాలన్నింటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే సబ్జెక్టుపై పూర్తి అవగాహన వస్తుంది.

1. ”అయ్యో! నాయనమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం నేనేకదా! ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే” అని బాధపడినది?
ఎ. శేఖర్‌

బి. రవి

సి. కిరణ్‌

డి. రాజు

2. కింది వాటిలో కొరవి గోపరాజుకు సంబంధం లేని వాక్యం ఏది?
ఎ. ఈయన భీంగల్‌ వాస్తవ్యుడు
బి. చందస్సు డ జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రవీణుడు
సి. రాణి శంకరమ్మ ఆస్థాన పండితుడు
డి. 15వ శతాబ్దానికి చెందిన వాడు

3. రావికంటి రామయ్య గుప్త మరియు ఆడెపు చంద్రమౌళి రచనలు వరుసగా గుర్తించండి?
ఎ. నగసత్యాలు శతకం డ నరసింహ శతకం

బి. నృకేసరి శతకం డ సుమతి శతకం

సి. శ్రీ శ్రీనివాస బమ్మల శతకం & నగసత్యాలు శతకం

డి.నగసత్యాలు శతకం డ శ్రీ శ్రీనివాస బమ్మల శతకం

4.”జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనములన్న” అను పద్యపాదం ఈ శతకంలోనిది?

ఎ. నగసత్యాలు శతకం

బి. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం

సి. నృకేసరి శతకం

డి. శ్రీ శ్రీనివాస బమ్మల శతకం

5. ”తొక్కుడు బండ” తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించిన కవి?

ఎ. ఆచ్చి వేంకటాచార్యులు

బి. చెరబండ రాజు

సి. సలంద్ర లక్ష్మీనారాయణ

డి. టి. కృష్ణమూర్తి యాదవ్‌

6. క్రింది జతలలో సరికాని జతను గుర్తించండి?
ఎ. శిల్పి – కళా సౌందర్యం
బి. మంజీర – నదీ ప్రశంస
సి. చదువు – మాతృ ప్రేమ
డి. అమరులు – ఉద్యమ స్ఫూర్తి

7. హిందువులు ఉర్సుల్లో, చిందులేసే నేల! / ముస్లింలు గుళ్ళలో ముడుపు కట్టే నేల!! – అను పంక్తులు రాసిన కవి?

ఎ. వెలపాటి రామారెడ్డి

బి. దాశరథి కృష్ణమాచార్య

సి. విశ్వనాథ సత్యనారాయణ

డి. కాళోజి నారాయణరావు

8. క్రింది జతలలో సరికాని జతను గుర్తించండి?

ఎ. వలసకూలి – పాట

బి. తీయని పలకరింపు – కథానిక

సి. చెలిమి – ఆధునిక పద్యం

డి.వాగ్భూషణం – వ్యాసం

9. ఉసిరికాయపై దీపాలు వెలిగించి, ఉసిరి చెట్టుకు పూజ చేసే రోజు..
ఎ. ఆశ్వయుజ బహుళ అమావాస్య

బి. కార్తీక పౌర్ణమి

సి. చైత్ర శుద్ధ నవమి

డి. రథసప్తమి

10. ‘సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అన్నది?

ఎ. విశ్వనాథ సత్యనారాయణ

బి. దాశరథి రంగాచార్య

సి. రావూరి భరద్వాజ

డి. సి. నారాయణ రెడ్డి

11. ”ఊపిరాడడంలేదు ఉక్కపోస్తుంది ఎ.సి. గదిలో, కారణం తెలుస్తుంది కవిత రాయలేదివాళ” అని సాహిత్యం పై తనకున్న మక్కువను తెలియజేసింది?

ఎ. సి. నారాయణ రెడ్డి

బి. విశ్వనాథ సత్యనారాయణ

సి. గుర్రం జాషువా

డి. దాశరథి రంగాచార్య

12. శ్రీమద్రామాయణ కల్పవృక్షాని’కి జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది?

ఎ. 1964

బి. 1967

సి. 1970

డి. 1971

13. ధర్మార్జునులు పాఠ్యభాగం ఎక్కడి నుండి స్వీకరించబడింది?
ఎ. విజయ విలాసం ప్రథమాశ్వాసం

బి. విజయ విలాసం ద్వితీయాశ్వాసం

సి. విజయ విలాసం తృతీయాశ్వాసం

డి. విజయ విలాసం చతుర్దాశ్వాసం

14. త్రిజగత్కారణ! భక్తపాలన! హరా! శ్రీ గుంటుమల్లేశ్వరా! – అను మకుటంతో శతకం రచించిన కవి?

ఎ. శిరశినహల్‌ కృష్ణమాచార్యులు

బి. ఆడెపు చంద్రమౌళి

సి.యర్రం విశ్వనాథ గుప్త

డి. ఉత్పల సత్యనారాయణాచార్య

15. ఇమ్మడి జెట్టి చంద్రయ్య జన్మస్థలం ఏది?

ఎ. కోరుట్ల

బి. రిమ్మనగూడ

సి. తాళ్లపల్లి

డి. చింతకాని

16. కోపంబు చే నరుల్‌ క్రూరాత్ములగుదురు/ కోపంబు మనుషుల కొంపముంచు – అను ప్రసిద్ధ సీస పద్యం రచించిన కవి?

ఎ. మామిండ్ల రామాగౌడ్‌

బి. రామప్ప వరకవి

సి. గంగుల శాయిరెడ్డి

డి. అందె వేంకటరాజం

17. యయాతి వేటకు వెళ్ళినప్పుడు దారితప్పి, ఈ ఋషి ఆశ్రమం చేరుకున్నాడు?
ఎ. గౌతముడు

బి. అంగీరసుడు

సి. అత్రి

డి. జాబాలి
18. ఈ క్రింది వారిలో అచ్చతెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడైనవారు?

ఎ. పొన్నికంటి తెలగన

బి. పాల్కురికి సోమనాథుడు

సి. చేమకూర వేంకట కవి

డి. నన్నయ్య

19. మూర్షాబాద్‌ జైలులో 60 రోజులు నిరసన వ్రతం చేసి అసువులు కోల్పోయిన బాలుడు?

ఎ. ఇంద్రపాల్‌

బి. సుఖదేవ్‌

సి. భగత్‌ సింగ్‌

డి. మణిలాల్‌ సేన్‌

20. క్రింది వాటిలో ”ఉద్యమ స్ఫూర్తి” పాఠ్యాంశానికి సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి?

ఎ. సబర్మతి ఆశ్రమం నుండి 79 మంది బృందంతో దండియాత్ర ప్రారంభమైంది.

బి. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గని జైలుకు వెళ్లిన ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి

సి. ”తెలంగాణ హిస్టరీ సొసైటీ” తరఫున 2009లో వెలుపడ్డ పుస్తకం ”1969 ఉద్యమం-చారిత్రక పత్రాలు”

డి. సుఖదేవ్‌, భగత్‌ సింగ్‌ లు అరెస్టయ్యారు. ఇంద్రపాల్‌ అప్రూవర్‌ గా మారాడు.

21. ”శ్రీ యాదగిరీంద్ర శతకం” రచించిన కవి?

ఎ. తిరువాయిపాటి వేంకట కవి

బి. ముకురాల రామారెడ్డి

సి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి

డి. ఎలకూచి బాల సరస్వతి

22. ”వ్యాఖ్యానచక్రవర్తి” అను బిరుదు పొందిన కవి?

ఎ.కాసుల పురుషోత్తమ కవి

బి. మల్లినాథ సూరి

సి. శ్రీపతి భాస్కర కవి

డి. పరవస్తు చిన్నయ సూరి

23. వెన్నెల మాసం, పువ్వుల కాలం అని ఏ మాసాన్ని అంటారు?

ఎ. చైత్రమాసం

బి. ఆషాడ మాసం

సి. శ్రావణమాసం

డి. కార్తీక మాసం

24. ”నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద”నని నినదించిన కవి?

ఎ. శ్రీ శ్రీ

బి. ఆరుద్ర

సి. దాశరథి కృష్ణమాచార్యులు

డి. దువ్వూరి రామిరెడ్డి

25. ఈ క్షోనిన్‌ నిలుబోలు సత్కవుల్‌ లేరు ఈ నాటి కాలమ్మునన్‌ – అని శ్రీనాథుని ప్రశంసించినది?

ఎ. ప్రోలయ వేమారెడ్డి
బి. పెద కోమటి వేమారెడ్డి
సి. రాజరాజ నరేంద్రుడు
డి. రఘునాథ నాయకుడు

26. నెల్లూరు కేశవ స్వామి తొలి కథల సంపుటి ”పసిడి బొమ్మ” ఎవరికి అంకితం ఇవ్వబడింది?

ఎ. పీవీ నరసింహారావు

బి. భాస్కరభట్ల కృష్ణారావు

సి. గూడూరి సీతారాం

డి. సురవరం ప్రతాపరెడ్డి

27. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలిపిన నెల్లూరు కేశవ స్వామి కథ?

ఎ. యుగాంతం

బి. అదృష్టం

సి. రూహీ ఆపా

డి. వంశాంకురం

28. శ్రీనాథుని శృంగార నైషధ కావ్యం ఎవరికి అంకితమీయబడింది?
ఎ. మామిడి సింగన

బి. అవచి తిప్పయ్య శెట్టి

సి. బెండంపూడి అన్నయామాత్యుడు

డి. ముమ్మడి శాంతయ్య

29. ”తెలంగాణ మాండలిక కథల రారాజు” అని ఎవరిని పిలుస్తారు?

ఎ. నెల్లూరు కేశవ స్వామి

బి. వట్టికోట ఆళ్వారు స్వామి

సి. గూడూరి సీతారాం

డి. చాగంటి సోమయాజులు

30.1931లో జనాభా లెక్కల సందర్భంగా అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించినది?

ఎ. వినోబాభావే

బి. భాగ్యరెడ్డి వర్మ

సి. కృష్ణ స్వామి ముదిరాజ్‌

డి. నెల్లూరు కేశవ స్వామి

సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.బి 5.డి 6.సి 7.ఏ 8.సి

9.బి 10.బి 11.ఎ 12.డి 13.ఎ 14.సి

15.సి 16.బి 17.డి 18.ఎ 19.డి 20.సి

21.ఎ 22.బి 23.డి 24.సి 25.బి 26.బి

27.డి 28.ఎ 29.సి 30.బి

– కోటని దత్తు
భాషోపాధ్యాయుడు
9381355409

Spread the love