ఆదా శర్మ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజీ బ్యూటీగా మారిపోయారు. ‘ది కేరళ ఫైల్స్, బస్తర్’ వంటి సినిమాలతో ఆదా శర్మ రేంజ్ మారిపోయింది. చాలా కాలం తరువాత అదా శర్మ ప్రస్తుతం తెలుగు వారిని ‘సి.డి’ క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో పలకరించ బోతున్నారు. కష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్సిఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. హర్రర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది. కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈనెల 24న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.