ఫార్మసీ చట్టాల అమలుకు, రిజిస్టర్ల ఫార్మసిస్ట్ హక్కుల కొరకు కృషి చేస్తా

– నూతన జిల్లా సహాయ కార్యదర్శి దత్తురామ్

నవతెలంగాణ – మద్నూర్
ఫార్మసీ చట్టాల అమలుకు రిజిస్టర్ల ఫార్మసిస్టు హక్కుల సాధన కొరకు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా ఫార్మసిస్టు సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి తైదల్ వార్ దత్తురాం ఒక ప్రకటనలో తెలిపారు. మద్నూర్ మండల కేంద్ర నివాసులైన తైదల్వార్ దత్తురాం ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం నూతన కమిటీలో జిల్లా సహాయ కార్యదర్శిగా నియమితులైనట్లు ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సత్యనారాయణ గౌడ్ ఎన్నిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఫార్మాసిస్టు సంక్షేమ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దత్తురాం మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, ఫార్మసిస్టు సంక్షేమ సంఘం అభివృద్ధికి ఫార్మసి చట్టాల అమలుకు, రిజిస్టర్ల ఫార్మసిస్టు హక్కుల సాధన కొరకు కృషి చేస్తానని తెలిపారు.
Spread the love