సీనియర్‌ అధికారుల సలహాలు తప్పని సరి

–  కొత్త జిల్లాల ఎస్‌పీలకు డీజీపీ సూచనలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
శాంతి భద్రతల పరిరక్షణ మొదలు క్లిష్టతరమైన నేరాల పరిశోధ నలో సీనియర్‌ పోలీసు అధికారుల సలహాలు తీసుకుని ముందుకు సాగా లని జిల్లాల ఎస్‌పీలుగా కొత్తగా బాధ్య తలు చేపట్టిన అధికారులకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ సూచించారు. శనివారం కొత్త ఎస్‌పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యంగా భారీ ఎత్తున జన సమూ హం వచ్చే ప్రాంతాలలో తొక్కిసలా టలు జరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముంటుందని ఆ సమయంలో పలు ముందస్తు జాగ్రత్త లు ముందుగానే తీసుకోవాల్సి ఉంటు ందని తెలిపారు. గతంలో ఏపీలో గో దావరి పుష్కరాలు, ఇటీవల జరిగిన ఒక పార్టీ బహిరంగసభలో చోటు చే సుకున్న తొక్కిసలాటలో ప్రజల ప్రా ణాలు పోయాయని ఉదహరించారు. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ముందుగానే పకడ్బందీగా ప్లాన్‌ వేసు కొనీ, బందోబస్తు స్కీము ను తయారు చేసుకుని అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Spread the love