అంగన్ వాడిల్లో ఘనంగా వార్షికోత్సవం 

నవతెలంగాణ-  మల్హర్ రావు
అంగన్ వాడిల మహాదేవ్ పూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక,మండల సూపర్ వేజర్ సరస్వతి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్ వాడి కేంద్రాల్లో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా టీచర్లు జయప్రద, విజయ,అరుణ,వెంకట నర్సమ్మ,వెంకట నారమ్మ,మనేమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా  3నుంచి 6 సంవత్సరాల  చిన్నారులతో విభిన్నమైన  వేషధారణ వేయించి ఆటలు,పాటలు,నృత్యాలు చేయించారు.ప్రీస్కూల్ విద్యార్దులకు అభివృద్ధి నివేదికలను అందించారు.అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులు మానసిక ఒత్తిడికి గురికాకుండా క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు.అంగన్ వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, కిషోర్ బాలికలు,గర్బిణీలకు అనేకమైన సేవలందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఆయాలు,చిన్న పిల్లల తల్లులు,చిన్నారులు పాల్గొన్నారు.
Spread the love