న్యాయవాదుల కోసం రక్షణ చట్టం చేయాలి

గుంటూరు : గుంటూరు లోని శుభం కన్వెన్షన్‌లో రెండురోజుల పాటు జరిగిన ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ 12వ ఏపీ రాష్ట్ర మహాసభ ఆదివారంతో ముగిసింది. ఈ మహాసభలో పలు తీర్మానాలు ఆమో దించారు. అడ్వకేట్లపై జరుగు తున్న దాడులకు అరికట్టటా నికి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని చేయాలని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని, మణిపూర్‌ హింసను ఆపాలని తీర్మానాలు చేశారు.
నూతన కమిటీ ఎన్నిక..
ఐలు మహాసభలో 70 మందితో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వారిలో 25 మందితో కార్యదర్శివర్గం ఎన్నికైంది. ఐలు ఏపీ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డి.రాజగోపాల్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా విజయవాడకు చెందిన సుంకర రాజేంద్రప్రసాద్‌ను తిరిగి ఎన్నుకున్నారు. నూతన ప్రధాన కార్యదర్శిగా హైకోర్టు న్యాయవాది నల్లూరి మాధవరావు, కోశాధికారిగా కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది కెంగార కుమార్‌ ఎన్నికయ్యారు.

Spread the love