ప్లాస్టిక్‌ కాలుష్య అంతానికి ఒప్పందం

– చర్చలు ప్రారంభించిన ఐరాస కమిటీ
పారిస్‌ : ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కాలుష్యం అంతచేయడం కోసం ఒక ఒప్పందం కుదర్చడానికి ఐక్యరాజ్య సమతి కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఏర్పడిన ఐరాసకు చెందిన ఇంటర్‌గవర్నమెంటల్‌ నెగోషియేటింగ్‌ కమిటీ సోమవారం పారిస్‌లో చర్చలు ప్రారంభించింది. అయితే ఈ ఒప్పందం ఏ విధంగా ఉండాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ సముద్ర పర్యావరణంతో సహా ప్లాస్టిక్‌ కాలుష్యంపై మొదటి అంతర్జాతీయ, చట్టబద్ధమైన ఒప్పందాన్ని అభివృద్ధి చేయడంలో ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. 2024 నాటికి ఈ కమిటీ ఐదు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇది కమిటీకి రెండో సమావేశం.
ఆరు నెలల క్రితం ఉరుగ్వేలో మొదటి సమావేశం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 430 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పతి అవుతుంది. ఇందులో మూడింట రెండువంతులు వ్యర్థాలుగా మారుతున్నాయి. సముద్రాలు, మానవ ఆహార గొలుసులోకి ఇవి ప్రవేశిస్తున్నాయి. 2060 నాటికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు మూడు రెట్లు పెరుగుతాయని ఒక అంచనా. 2040 నాటికి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయాలని ఐరాస కమిటీ కట్టుబడి ఉంది.

Spread the love