ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధం

బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌ పతాకం పై త్వరలో విడుదల కాబోతున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’- ఇచ్చట అందమైన ఫోటోస్‌ తీయబడును అనేది క్యాప్షన్‌. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య రావు హీరోగా నటించగా, లావణ్య హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ పాటను యువ హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ‘ఓ ముద్దుగుమ్మ’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఇదొక రొమాంటిక్‌ పాట. శ్రేష్ఠ అందించిన లిరిక్స్‌ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ప్రిన్స్‌ హెన్రీ అందించిన మ్యూజిక్‌ కూడా వినసొంపుగా ఉంది. మ్యూజిక్‌తో పాటు తన వాయిస్‌తో కూడా హెన్రీ బాగా మెప్పించారు. ముఖ్యంగా లిప్సిక గొంతు పాటకి బాగా సూట్‌ అయ్యింది. సినిమా పీరియడ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగనుంది. సాంగ్‌ వీడియోలో చూపించిన విజువల్స్‌ కూడా చాలా బాగున్నాయి. ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ,’చైతన్య సినిమా పాటని లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. సాంగ్‌ అదిరిపోయింది. పాట చాలా బాగుంది. వింటున్నప్పుడే నేను కూడా హమ్‌ చేస్తున్నాను. ఈ సినిమాతో చైతన్య మరొక సర్ప్రైజ్‌ ఇస్తాడు’ అని తెలిపారు. ఈ వేసవిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spread the love