తల్లిపాలు వద్దనీ..సొంత కొడుకు ప్రాణం తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్

నవతెలంగాణ – హైదరాబాద్ : సోషల్ మీడియలో లైకుల కోసం, పాపులరిటీ కోసం చేసే వీడియోలలో భాగంగా రష్యా కు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన కన్న కొడుకు ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అతను సోషల్ మీడియా వేదికగా డైట్ కంట్రోల్ గురించి తన ఫాలోవర్స్‌కు చెబుతుంటాడు. ఆరోగ్యం, ఆహారం గురించి తన యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయోగాలతో డైట్ సూచనలు చేస్తుంటాడు. మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితోనే ఎంతకాలమైన బతకొచ్చు అనేది అతని వాదన. అయితే దాన్ని నిరూపించడం కోసం నెలలు కూడా నిండని తన కొడుకుపై ఈ ప్రయోగం చేశాడు. తన భార్య ఎంత చెప్పినా కూడా మాక్సిమ్ మాట వినకుండా పాలు సైతం పట్టొద్దని మూర్ఖంగా ప్రవర్తించేవాడు. దీంతో క్రమ క్రమంగా పిల్లాడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే పలువురు ఒత్తిడి చేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో చికిత్స పొందుతూ శిశువు ప్రాణాలు కోల్పోయాడు.

 

Spread the love