మతిస్థిమితం లేక బావిలో పడి వృద్ధురాలు మృతి 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
మతిస్థిమితం లేని వృద్దురాలు బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యమ రాజవ్వ (70) మతిస్థిమితం లేక బావిలో పడి మృతి చెందింది. రాజవ్వ మూడు రోజుల క్రితం ఇంటి నుండి బయటికి వెళ్ళింది. ఇద్దరు బిడ్డలు ఉండటంతో కుటుంబ సభ్యులు  బిడ్డల ఇంటికి పోయిందని అనుకున్నారు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన రైతు గూళ్ళ అంజయ్య తన వ్యవసాయ బావిలో దుర్వాసన రావడంతో బావిలోకి  చూశాడు. నీటిపై తేలి ఉన్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలాన్ని వచ్చిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పందిళ్ళ గ్రామానికి చెందిన రాజవ్వగా గుర్తించారు . మతిస్థిమితం లేక బావిలో పడి మృతి చెందినట్లు  కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love