ఇంటింటికీ చెత్త సేకరణ పై అవగాహన

నవతెలంగాణ-ఉప్పల్‌
ప్రతీ ఇంటిలోని చెత్తను ఇంటింటికీ చెత్త సేకరించే ఆటోలకు ఇవ్వాలని రామంతపూర్‌ డివిజన్‌ పరిధిలోని వివేక్‌నగర్‌, కామాక్షిపురం కాలనీ వాసులకు జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది, యూసీడీ మహిళ విభాగం ఆర్పీలు, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ సభ్యులు, స్కూలు విద్యార్థులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీధి వీధిన తిరుగుతూ జీహెచ్‌ఎంసీ ఆటోకు చెత్తను ఇవ్వాలని మహిళలను ప్రోత్సహించారు. ఆరు బయట ప్రదేశాల్లో, మోరీల్లో చెత్తను పడేయోద్దని సూచించారు. ప్రతీ రోజు చెత్తను జీహెచ్‌ఎంసీ ఆటో వాళ్లకు ఇచ్చి నెల అయ్యాక వారికి యూజర్‌ చార్జెస్‌ డబ్బు చెల్లించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ ఆటో వారికి జీహెచ్‌ఎంసీ ఎలాంటి జీతభత్యాలు చెల్లించని విషయాన్ని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య విభాగం సెక్షన్‌ హెడ్‌ చందన చౌహన్‌, మహిళ విభాగం యూసీడీ సెక్షన్‌ అధినేత్రి రమాదేవి, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ శ్రీధర్‌ రెడ్డి, శానీటరీ సూపర్‌వైజర్‌ సుదర్శన్‌, జవాన్లు దస్తగిరి, మారయ్య, సిద్ధి లింగం, జంగయ్య, ఎస్‌ఎఫ్‌ఏలు బాబురావు, కిషోర్‌కుమార్‌, విద్యాసాగర్‌, పారిశుధ్య కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ ”పసుపు, కుంకుమ, వాయనం” అందజేశారు. చెత్తను ఆరు బయట ప్రదేశాల్లో వేసిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు.

Spread the love