దేశ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి – కాంగ్రెస్‌, బీజేపీ విమర్శలను తిప్పి కొట్టాలి – మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-పాలకుర్తి
దేశంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయని హామీలతో దేశప్రజలను నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌ రావు విమర్శించారు. సోమవారం మండలంలోని పాలకుర్తి వన్‌, టూ ఎంపీటీసీల పరి ధిలోని ఆత్మీయ సమ్మేళనాన్ని మండల కేంద్రంలో గల బృందావన్‌ గార్డెన్‌లో, దర్దేపల్లి ఎంపీటీసీ పరిధిలోని దర్దేపల్లి, టీఎస్‌ కేతండా, కొండాపురం ఎంపీటీసీ పరిధిలోని కొండాపురం, పెద్ద తండా (కె) గ్రామాల తో దర్జేపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కా ర్యక్రమానికి ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్పర్సన్‌ ఎర్ర బెల్లి ఉష దయాకర్‌ రావు, డిసిసిబి జిల్లా చైర్మన్‌ మర్నేని రవీందర్రావులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మాట్లా డుతూ దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేం దుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏటా రెండు కో ట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ యువతీ యువకుల ను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి పాలనలో నిత్యవసర సరుకుల ధరలతో పాటు చమరులు ధరలుపెరగడంతో సామాన్య ప్రజలపై ఆ ర్థిక భారం ఎక్కువైందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయక త్వంలో తెలంగాణ సంక్షేమంలో అభివృద్ధి చెందుతుం టే జీర్ణించుకోలేని కాంగ్రెస,్‌ బిజెపి విమర్శలు చేస్తు న్నాయన్నారు. కాంగ్రెస్‌ బిజెపిల విమర్శలను కార్యకర్త లందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పి ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు ఎండి మదర్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎండి సర్వర్‌ ఖాన్‌, బిఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్ల య్య, ఆయా గ్రామాల సర్పంచులు వీరమనేని యాకాం తరావు, ఇమ్మడి ప్రకాష్‌, లావుడియా శాంతమ్మ, ధారావత్‌ బాలు నాయక్‌, మంగ భాగ్యమ్మ సోమయ్య, ఐలమ్మ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, కొడకండ్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి, తొర్రూర్‌ సొసైటీ చైర్మన్లు అశోక్‌ రెడ్డి, గోనే మైసిరెడ్డి, పాలకుర్తి సొసైటీ వైస్‌ చైర్మన్‌ కారుపోతుల వేణు, ఆయా గ్రామాల ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జీలు చిక్కుడు రాములు, భూమా రంగయ్య, కమ్మగాని రమేష్‌, కొడకండ్ల మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ లావుడియా దేవా నాయక్‌, నాయకులు లావుడియా మల్లు నాయక్‌, లావుడియా అశోక్‌ నాయక్‌, ఎంపీటీసీలు మంద వీరలక్ష్మి సోమయ్య, లావుడియా లలిత దేవేందర్‌ లతోపాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love