బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి

సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్మికుడిపై ఉందని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు. గురువారం కాటేదాన్‌ రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జి.కురుమయ్య అధ్యక్షతన నిర్వ హించారు. ముఖ్య కార్యకర్తలకు క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికు ల జీవితాలు చీకటిమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభు త్వం కాల రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పి పేద ప్రభుత్వలపై పెను భారాలు మోపుతున్నారని అన్నారు. కార్మికులపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజులలో కార్మికులందరూ ఐక్యమత్యంతో పోరాడి ఈ ప్రభుత్వాని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సీఐటీయూ విశిష్టతపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌ బోధించారు. కార్పొరేటీకరణ వలన కార్మికులపై దాడి క్లాసును రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రామ్మోహన్‌ బోధించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు జె.పెంటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు పార్వతి, స్వామి, ఎన్‌.జంగయ్య, రాములు, మైలారం జంగయ్య, కృష్ణయ్య, పాండు, నరసింహ, ముస్తఫా, శ్రీను, బుగ్గన, చంద్రయ్య, ఎల్లయ్య, భగవంతు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love