కరెంటోళ్లా.. మజాకా..!

ఎవ్వరి మాటా వినడు సీతయ్యా… అన్నట్టు, కరెంటోళ్లు ఈ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం మీద సీరియస్‌ అయ్యారు. ‘అది ఐపీఎల్‌ మ్యాచ్‌ అయితే ఏంటి..? ఇంటర్నే షనల్‌ క్రికెట్‌ స్టేడియం అయితే ఏంటి..?’ నా బిల్లు నాకు కట్టకపోతే కరెంటు కట్‌చేసి పడేస్తామంతే…అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అవటమే కాదు… మొన్నటి హైదరాబాద్‌-చెన్నై మ్యాచ్‌కు ఒకరోజు ముందు ఉప్పల్‌ స్టేడియానికి కరెంటు కట్‌చేసి పడేశారు. దెబ్బకు హైదరా బాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కు దిమ్మతిరిగి బొమ్మ అగుపడ్డది. కరెంటు డిపార్టుమెంటోళ్లని బతిమిలాడు కున్నారో లేక బిల్లు మొత్తం కట్టేశారో తెలీదుగానీ, మ్యాచ్‌ రోజు మాత్రం స్టేడియానికి కరెంటు సరఫరా అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తరహాలో బడాబాబుల పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదా యాలు కరెంటు బిల్లులు ఎగ్గొడితే… కత్తెరతో కరెంటు తీగలు కట్‌చేసి, ముక్కు పిండి బిల్లు వసూలు చేయాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రజలు…
– కె.నరహరి

Spread the love