నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్

– నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్
– పనులను లాంచనంగా ప్రారంభించనున్న ఎమ్మెల్యే మెచ్చా
– తెలంగాణ ఆవిర్భావం నాడే ముహూర్తం
– ప్రకటించిన ఎం.పి.పి శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనులను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లాంచనంగా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజైన జూన్ 2 న లాంచనంగా ప్రారంభించనున్నట్లు ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల అశ్వారావుపేట మండల ప్రజల కలను సాకారం చేస్తున్నందుకు ఎమ్మెల్యే మెచ్చాకు కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం ఉదయం 9 గంటలకు స్థానిక మూడు రోడ్ల కూడలి లో కొబ్బరికాయ కొట్టీ సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. నియోజక వర్గం ఏర్పడి 14 సంవత్సరాల అనంతరం అశ్వారావుపేట పట్టణంలో వెలుగులు నోచుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల, నాయకులు,అన్ని పార్టీల నాయకులు,అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Spread the love