కావేరీ సీడ్ ప్లాంట్ పై అకస్మికంగా తనిఖీలు నిర్వహించిన సీఐ ఎస్సై

నవతెలంగాణ-శంకరపట్నం : కరీంనగర్ సిపి ఆదేశాల మేరకు శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ శివారులో గల కావేరీ సీడ్ ప్లాంట్ లో పనిచేస్తున్న సిబ్బంది ఏమైనా మత్తు పదార్థాలు ఉన్నాయనే సమాచారంతో శుక్రవారం కేశవపట్నం పోలీసులు కేంద్రబలగాలతో, హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్,కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి,మరియు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనికిలు నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి కావేరి సీడ్ ప్లాంట్ లో పని చేస్తున్న సిబ్బంది ఉండే రూములలో ఏమైనా ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నారని సమాచారంతో వారు ఉండే రూములను చెక్ చేయడం జరిగిందన్నారు. అలాగే వర్కర్స్ యొక్కఆదార్ కార్డ్స్ ఇతర ఐడి ప్రూప్స్ చెక్ చేశామని అలాగే కావేరీ సీడ్స్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి వారి యొక్క పూర్తి వివరాలు సేకరించి అందులో పనిచేసే వర్కర్స్ కు ప్రతి ఒక్కరికీ ఐడి ప్రూప్స్ తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏలాంటి అవంచనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా ఆముదాలపల్లి ఎక్స్ రోడ్ వద్ద వెకిల్ చెకింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love