ఐక్య కార్మిక ఉద్యమాల సారథి సిఐటియు : భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్‌.

నవతెలంగాణ -బూర్గంపాడు
భారత దేశంలో ఐక్య కార్మిక ఉద్యమాల సారధి సిఐటియు అని, సిఐటియు మార్గదర్శకత్వంలో పాలక వర్గాల ప్రైవేటీకరణ, మతోన్మాద కుట్రలను బహిర్గతం చేసి కార్మికులను చైతన్య పరచడమే నేడున్న కర్తవ్యమని సీఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్‌ అన్నారు. సారపాక లోని ఐటిసి బిపిఎల్‌ గేట్‌ వద్ద ఐటిసి పర్మినెంట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ల ఆధ్వర్యంలో 53వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనియన్‌ నాయకులు మలికంటి వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డిలు సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.అజరు కుమార్‌, కనకం వెంకటేశ్వర్లు, రాజు, తిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love